బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రియా ప్రకాష్ వారియర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో..

Priya Prakash Varrier Got A Chance In Pawan Kalyan Movie
x

పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం కొట్టేసిన "లవర్స్ డే" బ్యూటీ 

Highlights

* పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న వింక్ బ్యూటీ

Pawan Kalyan: చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. "గోపాల గోపాల" సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా నిన్న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసింది చిత్ర బృందం. తమిళ్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రివిక్రమ్ కేతిక శర్మను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లవర్స్ డే బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్ సరసన "చెక్" సినిమాలో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్స్ చేయలేకపోయింది. కానీ తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడం ఈమె అదృష్టం అనే చెప్పుకోవాలి.

ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ప్రియా ప్రకాష్ వారియర్ కి టాలీవుడ్ లో కూడా బోలెడు తలుపులు తెరుచుకున్నట్టే. ఇక ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ తో తనకి ఒక సన్నివేశం కూడా ఉందని అంటున్న ప్రియ ప్రకాష్ వారియర్ ఆ సన్నివేశం షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇక అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories