తెలుగు సినిమాలో ప్రియా ప్రకాష్ కు అవకాశం ఇవ్వనున్న హీరో

తెలుగు సినిమాలో ప్రియా ప్రకాష్ కు అవకాశం ఇవ్వనున్న హీరో
x
Highlights

కేవలం ఒక్క కన్నుగీటుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. ఈమె డెబ్యూ సినిమా అయినా 'ఓరు ఆడార్ లవ్' తెలుగులో 'లవర్స్ డే' అనే...

కేవలం ఒక్క కన్నుగీటుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. ఈమె డెబ్యూ సినిమా అయినా 'ఓరు ఆడార్ లవ్' తెలుగులో 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ ఇప్పటికే ప్రియా ప్రకాష్ కు ఒక పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మధ్యనే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ప్రియా ప్రకాష్ వారియర్ ను స్క్రీన్ టెస్ట్ కు అటెండ్ అవ్వమని అడిగాడట. అయితే ప్రియా ఇంకా స్క్రీన్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ స్క్రీన్ టెస్ట్ మరియు ఆడిషన్లో గనుక ఈమె పాత్రకు సరిపోతుంది అనిపిస్తే ఇక ఈమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టే. అదే నిజమైతే ఈ సినిమా ఈమెకు తెలుగులో మొదటి సినిమాగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories