ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్

ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్
x
Highlights

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రావు రమేష్, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. జైకుమార్ ఫోటోగ్రఫీ అందించగా.. తమన్ నేపథ్య సంగీతం అందిచారు.

కుటుంబ కథలతో వెండి తెర మీద సందడి చేయడం టాలీవుడ్‌లో మామూలే. ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కుతాయి. ఈ సంవత్సరం ఆ ప్రయత్నం దర్శకుడు మారుతి- సాయిధరమ్తేజ్ లతో గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బన్నీ వాస్ చేశాయి. కామెడీ చిత్రాలతో విజయాల్ని మూటగట్టుకునే మారుతి, ఇమేజి చట్రంలోకి రాకుండా సినిమాలు చేస్తున్న సాయి తేజ్ కలిసి చేసిన తాజాగా చిత్రం ప్రతిరోజు పండగే చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఒక సారి చూద్దాం.

ఈ శుక్రవారం విడుదలైన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16కోట్లకు అమ్ముడు పోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు పండగే సినిమా దాదాపు 18కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కలెక్షన్లు ఏరియా వారిగా పరిశీలిస్తే నైజాంలో 5.5కోట్లు, ఈస్ట్ 1.3కోట్లు, వెస్ట్ 1.1 కోట్లు, సీడెడ్‌లో 2.7కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఇక గుంటూరులో 1.4కోట్లు, కృష్ణా 1.2కోట్లు, నెల్లూరులో 60లక్షలు రాబట్టి నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 15.80కోట్లు బిజినెస్ చేసింది.

ఒక కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలను ఒకసారి చూస్తే 17.80కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్రకథానాయకుడు బాలకృష్ణ సినిమా రూలర్ సినిమాతో పోటీ పడటం, అలాగే తమిళ హీరో కార్తీ దొంగ చిత్రంతో పోటీ పడటంతో కాస్త కలెక్షన్లపై ప్రభావం చూపింది. సాయిధరమ్ తేజ్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5కోట్లు వసూల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 4.5కోట్ల రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తు‎న్నాయి. ఈ వారంతంలో సినిమా కలెక్షన్ల రిపోర్టుపై సినిమా ఆధారపడి ఉంటుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories