ప్రభాస్ కోసం సముద్రంలో ఫైట్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

Prashant Neil is Planning Prabhas Fight Scenes Differently in Salaar Movie
x

ప్రభాస్ ఫైట్ సన్నివేశాలు విభిన్నంగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

Highlights

*ప్రభాస్ ఫైట్ సన్నివేశాలు విభిన్నంగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: "బాహుబలి" సినిమా తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత చేసిన "సాహో" మరియు "రాధేశ్యామ్" సినిమాలతో మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అందుకున్నారు. దీంతో తన తదుపరి సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా "సలార్" విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా క్లైమాక్స్ మొత్తం సముద్రంలో జరుగుతుందట. ముఖ్యంగా సముద్రం లోపల చేసే ఛేజింగ్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ కి తీసిన ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", నాగ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" మరియు సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories