Mokshagna: ఆగిపోయిన మోక్షజ్ఞ సినిమా..?

Prasanth Varma Mokshagna Combination Moive On Hold
x

ఆగిపోయిన మోక్షజ్ఞ సినిమా..? 

Highlights

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందా..? అంటే అవుననే వినిపిస్తోంది. డిసెంబర్‌లోనే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడినట్టు టాక్ నడుస్తోంది.

Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందా..? అంటే అవుననే వినిపిస్తోంది. డిసెంబర్‌లోనే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడినట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞ సినిమా ఆగిపోవడానికి కారణమేంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా రాబోతున్నారని వార్తలు రావడమే కాకుండా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆసల్యం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. త్వరలో సినిమా రాబోతుందని అభిమానులు ఆనందపడే లోపు వారి ఆశలు ఆవిరైపోయాయని తెలుస్తోంది. ఆ మధ్య సింబా ఈజ్ కమింగ్ అంటూ ప్రమోషన్ చేసిన ఈయన.. ఇప్పుడు మాత్రం సైటెంట్ అయిపోయారు. దీంతో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువైపోయింది. దాంతో ఫ్యాన్స్ నిజమేనేమోనని కంగారు పడ్డారు. అయితే అప్పట్లో దీనిపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య ఓ ఈవెంట్‌కి హాజరైన బాలయ్య.. మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిందన్నారు.

మరోవైపు సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ స్పందిస్తూ సినిమా ఆగిపోలేదని త్వరలోనే సరికొత్త అప్డేట్ తెలియజేస్తామన్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై మరొక వార్త సోషల్ మీడియాలో వినపడుతుంది. మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ, ప్రభాస్‌తో బ్రహ్మరాక్షస్ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా సంగతి పక్కన పెడితే.. బాలయ్య దర్శకత్వంలో ఆదిత్య 999, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories