Pranitha: మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రణీత సుభాష్

Pranitha Subhash is Coming Back to the Movies
x

Pranitha: మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రణీత సుభాష్

Highlights

Pranitha: తల్లిగా మారక మొదటి సినిమా సైన్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

Pranitha: కన్నడ సినిమాలతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ప్రణీత సుభాష్ "అత్తారింటికి దారేది", "బ్రహ్మోత్సవం" వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. కొన్ని మంచి సినిమాలలో నటించిన ప్రణీత ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఇక 2021లో నితిన్ అనే ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న ప్రణీత ఆ తర్వాత సినిమాలకి దూరమైంది. ఈ మధ్యనే ఒక పాపకు కూడా జన్మనిచ్చిన ప్రణీత తనను తాను ఒక ఆడపిల్ల తల్లిగా ప్రకటించుకుంది.

కానీ తాజాగా ఇప్పుడు ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఈసారి ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ప్రణీత. మలయాళం లో ప్రముఖ హీరో దిలీప్ నటిస్తున్న 148 సినిమాలో ప్రణీత సుభాష్ హీరోయిన్గా కనిపించనుంది. మాతృత్వం పొందిన తర్వాత ఆ ప్రణీత సుభాష్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. తాజాగా దీని గురించి మాట్లాడుతూ, "నేను బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్నాను.

నా కూతురు ఆర్నా నుంచి మొదటిసారి ఇంతకాలం దూరంగా ఉండబోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇది కూడా నార్మల్. వర్కింగ్ మదర్స్ కి ఆ బాధ తెలుస్తుంది. ఇల్లు మరియు పని రెండిటి మధ్య బాలన్స్ చేసుకోవటం కూడా అందరూ చేసేదే," అని చెప్పుకొచ్చింది ప్రణీత సుభాష్. ఎలాగో సినిమాలో నటించడానికి రెడీ అయింది కాబట్టి మరి ప్రణీత ఎప్పుడూ తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories