Pradeep Ranganathan Remuneration: రూ.50 లక్షల నుంచి 25 కోట్లు.. నువ్ కేక 'డ్యూడ్'!

Pradeep Ranganathan Remuneration
x

Pradeep Ranganathan Remuneration: రూ.50 లక్షల నుంచి 25 కోట్లు.. నువ్ కేక 'డ్యూడ్'!

Highlights

Pradeep Ranganathan Remuneration: తమిళ సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న యువ ప్రతిభల్లో ప్రదీప్ రంగనాథన్ పేరు ముందుంది. రచయిత, దర్శకుడు, హీరోగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Pradeep Ranganathan Remuneration: తమిళ సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న యువ ప్రతిభల్లో ప్రదీప్ రంగనాథన్ పేరు ముందుంది. రచయిత, దర్శకుడు, హీరోగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాణించడం అంత ఈజీ కాదు. కానీ టాలెంట్‌తోనే ప్రదీప్ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. కేవలం నిలబడడమే కాదు.. సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతున్నాడు. ఎంతలా అంటే.. రూ.50 లక్షల నుంచి 25 కోట్లుతీసుకునేలా.

ప్రదీప్ రంగనాథన్ తన తండ్రి జిరాక్స్ షాపులో పని చేసేవాడు. సినిమాలపై ఉన్న ఇష్టంతో సమయం ఉన్నప్పుడల్లా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ అవవడంతో 'కోమలి' చిత్రంలో దర్శకుడిగా అవకాశం వచ్చింది. మొదటి సినిమాతోనే ప్రదీప్ తన ముద్ర వేశాడు. తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేయాలని.. తాను తీసిన షార్ట్ ఫిల్మ్‌నే 'లవ్ టుడే'గా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా, హీరోగా చేసిన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్', 'డ్యూడ్' చిత్రాలతో 100 కోట్ల హీరోగా మారిపోయాడు. కోలీవుడ్‌లో చాలా మంది హీరోలు సైతం ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్‌ స్టేటస్ అందుకోలేదు.

రెమ్యునరేషన్ విషయంలో ప్రదీప్ రంగనాథన్ ఎదుగుదల షాకింగ్ అనే చెప్పాలి. ప్రదీప్ మొదటగా దర్శకత్వం వహించిన కోమలి సినిమాకు రూ.50 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. లవ్ టుడే చిత్రంలో రచయిత-దర్శకుడు-హీరోగా పనిచేసి రూ.1.5 కోట్లు అందుకున్నాడు. ఇందులో రూ.70 లక్షలు ముందుగానే, సినిమా సక్సెస్ తర్వాత రూ.80 లక్షలు అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హీరోగా రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. డ్రాగన్ సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే డ్యూడ్ కోసం రూ.12 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.

ప్రదీప్ రంగనాథన్ తదుపరి సినిమాల కోసం నిర్మాతలు రూ.25 కోట్లు వరకూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రదీప్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా బీబమ్మ కృతి శెట్టి నటిస్తుండగా.. డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిజేత్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఎదుగుదల ప్రదీప్ ప్రతిభకు నిదర్శనం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్‌పై పట్టుతో పాటు యూత్‌కు దగ్గరైన కథల ఎంపిక ప్రదీప్ విజయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ స్థాయిలో పారితోషికం పెరగడం ఆయన మార్కెట్ విలువ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. చిన్న బడ్జెట్‌తో ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు భారీ రెమ్యూనరేషన్‌ల దిశగా దూసుకెళ్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories