Prabhudeva: వారసత్వం, ప్యాషన్‌తో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కొడుకుని పరిచయం చేసిన ప్రభుదేవా

Prabhudeva Introduced His Son Rishi Deva In Chennai Dance Event
x

వారసత్వం, ప్యాషన్‌తో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కొడుకుని పరిచయం చేసిన ప్రభుదేవా

Highlights

సినీ రంగంలో ప్రభుదేవా పేరు తెలియని వారు ఉండరు. ఒక డాన్స్ మాస్టర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Prabhudeva: సినీ రంగంలో ప్రభుదేవా పేరు తెలియని వారు ఉండరు. ఒక డాన్స్ మాస్టర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు తన వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కొడుకుని అందరినీ పరిచయం చేశాడు. తన కొడుకు డాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ వీడియాలో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ మారింది.

ఇటీవల చెన్నైలో ప్రభుదేవా మొదటిసారిగా డాన్స్ లైవ్ కాన్సర్ట్ వైబ్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో కొన్ని గంటల పాటు రకరకాల సాంగ్స్‌కు ప్రభుదేవా, అతని టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు అనేకమంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ప్రభుదేవా తన కొడుకు రిషి దేవాను అందరికీ పరిచయం చేశాడు.

అంతేకాదు ఈ ఈవెంట్‌లో తండ్రి, కొడుకు కలిసి చేసిన డాన్స్‌ని ప్రభుదేవా తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా కొడుకు రిషి దేవాని పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. మేమిద్దరం మొదటిసారి స్టేజ్ షేర్ చేసుకున్నాము. ఇది డాన్స్ కంటే ఎక్కువ. వారసత్వం, ప్యాషన్‌తో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చారు.

ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిషి, ప్రభుదేవా ఇద్దరి డాన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవతున్న ఈ వీడియోను చూసిన వారంతా రిషి అచ్చం ప్రభుదేవా లాగే ఉన్నారని.. ఆయనలానే డాన్స్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి రిషి కూడా తండ్రి లాగే స్టార్ కొరియోగ్రాఫర్ అవుతాడా చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories