Top
logo

ఈసారి రెండు దెయ్యాలట

ఈసారి రెండు దెయ్యాలట
Highlights

2016లో ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవి' సినిమా తెలుగులో 'అభినేత్రి' గా విడుదలై మంచి విజయాన్ని ...

2016లో ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవి' సినిమా తెలుగులో 'అభినేత్రి' గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఎండింగ్ లో దెయ్యం రూబీ మళ్లీ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్ గా 'అభినేత్రి 2' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రభుదేవా, తమన్నా, డింపుల్ హాయాతి, నందిత శ్వేతా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఒక నిమిషం నిడివి గల ఈ వీడియో ఈ సినిమా మొదటి పార్ట్ మొదటి భాగం ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చిత్ర టీజర్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సినిమా టీజర్ చూస్తే ఈ సినిమాలో రెండు దయ్యాలు ఉండబోతున్నాయని అనిపిస్తుంది. ప్రభుదేవా బాడీ లో అలెక్స్ అనే దయ్యం పట్టినట్టుగా అర్థం అవుతోంది. ఈ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ కోవై సరళ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ వింటే ఈ సినిమాలో రెండు దయ్యాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తారీఖున ఆ విడుదల కానుంది.

Next Story


లైవ్ టీవి