Prabhas : ఆ రికార్డులు బద్దలవుతాయా? స్పిరిట్ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం

Prabhas : ఆ రికార్డులు బద్దలవుతాయా? స్పిరిట్ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం
x

Prabhas : ఆ రికార్డులు బద్దలవుతాయా? స్పిరిట్ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం

Highlights

ప్రభాస్ 2026లో వరుస సినిమాలతో అలరించబోతున్నారు. మొదట ది రాజా సాబ్‎తో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నప్పటికీ, ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన స్పిరిట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రీ నటిస్తోంది.

Prabhas : ప్రభాస్ 2026లో వరుస సినిమాలతో అలరించబోతున్నారు. మొదట ది రాజా సాబ్‎తో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నప్పటికీ, ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన స్పిరిట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రీ నటిస్తోంది. మొదట దీపికా పదుకొణె ఈ సినిమాకు మొదట అనుకున్నప్పటికీ ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక పెద్ద మార్పు చేసుకుంటున్నారని సమాచారం.

సందీప్ రెడ్డి వంగా గతంలో యానిమల్ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో హీరోగా రణబీర్ కపూర్ నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన త్వరలో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టనున్నారు. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

స్పిరిట్ సినిమా కేవలం ఆరు నెలల్లోనే రెడీ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైన అంశం ప్రభాస్ లుక్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంటుగా కనిపిస్తారని అంటున్నారు. యంగ్ లుక్ లో కనిపించడం కోసం ప్రభాస్ తన బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని, కొత్త హెయిర్‌స్టైల్‌ను ప్రయత్నిస్తారని సమాచారం. అలాగే, ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంతకుముందు ఎప్పుడూ వేసుకోని దుస్తులను ధరించబోతున్నారు. ఈ పాత్ర ప్రభాస్‌ను తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకువస్తుందని, ఇది ఆయనకు మొదటి డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కావడంతో ఒక కొత్త జోన్‌లోకి వెళ్తారని చెబుతున్నారు.

రణబీర్-షాహిద్ రికార్డులు బద్దలవుతాయా?

గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన కబీర్ సింగ్(షాహిద్ కపూర్), యానిమల్(రణబీర్ కపూర్) సినిమాలు రెండూ అద్భుతమైన విజయం సాధించాయి. ఇప్పుడు స్పిరిట్ సినిమా ఈ రెండు సినిమాల రికార్డులను బద్దలు కొట్టగలదని సినీ వర్గాల అంచనా. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొణె నటించాల్సి ఉన్నప్పటికీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని తీసుకున్నారు. తృప్తి డిమ్రీ కూడా యానిమల్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories