బరువు తగ్గనున్న 'బాహుబలి'
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు...
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు 'సాహో' మరోవైపు 'జాన్' చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు మన 'బాహుబలి'. ఈ రెండు సినిమాల్లోనూ ప్రభాస్ వేరే వేరే లుక్స్ తో కనిపించనున్నాడు. రెండూ వేరే వేరే జోనర్లు కాబట్టి రెండిటిలోనూ ఒకే లుక్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. తాజాగా ఒక భారీ యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ప్రిపరేషన్ లో ఉన్నాడట. ఈ యాక్షన్ సీన్లలో ప్రభాస్ స్లిమ్ గా కనిపించాలని యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ చెప్పారట. అందుకే ప్రస్తుతం ఉన్న వెయిట్ నుంచి 8-10 కేజీలు ప్రభాస్ తగ్గాల్సి ఉంది. రోజూ 2గంటలు పైగానే ప్రభాస్ కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా వెంకీ వారింట వెలికి వెళ్లిన ప్రభాస్ లో ఫోటోలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 90 శాతం స్టంట్స్ తానే డూప్ లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా విడుదలైన రెండు మేకింగ్ వీడియో లకు మంచి ఆదరణ లభించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక 2020 జనవరిలో 'జాన్' చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట.
లైవ్ టీవి
ఈ నెలాఖరుకల్లా 'వైయస్ఆర్ నవశకం' సర్వే పూర్తి కావలి..
6 Dec 2019 2:36 AM GMT2020 ఏడాది సెలవులు ఇవే..
6 Dec 2019 2:31 AM GMTIND vs WI టీ20 మ్యాచ్ : అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
6 Dec 2019 2:29 AM GMTబిగ్ బ్రేకింగ్ : దిశ నిందితుల ఎన్కౌంటర్
6 Dec 2019 1:59 AM GMTటీడీపీ నూతన కార్యాలయంలో లోకేశ్ దంపతుల పూజలు.. నేడు...
6 Dec 2019 1:51 AM GMT