Prabhas Village In Nepal:ప్రభాస్ పేరుతో ఊరు.. ఎక్కడంటే..?

Prabhas Village In Nepal Goes Viral On Social Media
x

ప్రభాస్ పేరుతో ఊరు.. ఎక్కడంటే..?

Highlights

ప్రభాస్ పేరు పై ఒక గ్రామం ఉందన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది ఇండియాలో కాదు పక్క దేశం నేపాల్‌లో ఉండడం విశేషం.

Prabhas Village In Nepal: సాధారణంగా ప్రాంతాలకు స్వాతంత్ర్య యోధుల పేర్లు పెడుతూ ఉంటారు. లేదంటే ఆ ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా పేర్లు పెట్టడం విన్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇటీవల కాలంలో మాత్రం తమ వీధులకు స్టార్స్ పేర్లు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రికెటర్స్ పేర్లతో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ హీరో పేరు మీద ఒక ఊరు ఉంది. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అది ఎక్కడ ఉందో చూద్దాం.

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి, సాహో, సలార్ వంటి చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు డార్లింగ్ ప్రభాస్. అయితే ప్రభాస్ పేరు పై ఒక గ్రామం ఉందన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది ఇండియాలో కాదు పక్క దేశం నేపాల్‌లో ఉండడం విశేషం. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా.. ఒక ఊరి పేరు ప్రభాస్ అని రాసి ఉంది. దీంతో అతను ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. నేను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నాను. మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుంది. మీరు ఎప్పుడైన ప్రభాస్ అనే పేరుతో ఉన్న విలేజ్‌ని చూశారా అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ ఊరుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రామానికి ప్రభాస్ అని పేరు ఎందుకు వచ్చింది.. దాని వెనుక కథ ఏంటన్నది స్పష్టంగా తెలియదు. అయినా ప్రభాస్ పేరు ఉండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నేపాల్‌లోని ఒక చిన్న పట్టణం మాత్రమే అయినప్పటికీ.. ప్రభాస్ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్‌కు ఇండియాతో పాటు నేపాల్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. రెబల్ స్టార్ నటించిన బాహుబలి, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలు నేపాల్ మార్కెట్‌లో భారీ వసూళ్లు రాబట్టాయి.

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ శ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాతో మొట్ట మొదట పాన్ ఇండియా స్టార్‌గా మారారు. హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉంది. అంతేకాదు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా ప్రభాస్‌కు పేరు.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఈ ఏడాది రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories