Prabhas: రెండో షెడ్యూల్‌ ప్లాన్ చేస్తున్న 'సలార్' టీం

Prabhas to appear in a dual role?
x

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన రాబోయే సినిమా 'రాధే శ్యామ్' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనాతో 'సలార్' షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక రెండో షెడ్యూల్‌ ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌ లో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన కెరీర్లో రెండో సారి డబుల్ రోల్‌లో నటించనున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లు ట్విట్టర్లలో షేర్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ రెండు పాత్రలను ప్రేక్షకులను అబ్బురపరిచేలా రాసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14 న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories