Kalki OTT: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే.. కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, ఎందులో అంటే..?

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Aug 2024 10:18 AM IST
Prabhas Starrer Kalki 2898 AD Movie OTT Streaming Starts from August 22nd in Amazon Prime and Netflix
X

Kalki OTT: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే.. కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, ఎందులో అంటే..?

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచనం సృష్టించింది. ఏకంగా రూ. వెయ్యి కోట్లకుపైగా రాబట్టి ఇండియన్‌ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. నాగ అశ్విన్‌ అద్భుత విజన్‌ ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్తే.. ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌ హాసన్‌ల నటన సినిమాను విజయ తీరాలకు చేర్చాయి.

పురాణాలను, ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని కంబైడ్‌ చేస్తూ నాగ అశ్విన్‌ సృష్టించిన అద్భుతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఓవర్‌సీస్‌ మార్కెట్లో కూడా గతంలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. ఇదిలా ఉంటే థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడా వస్తుందా అని సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు నెలల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా చిత్ర యూనిట్ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 22వ తేదీ నుంచి హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతుండగా, అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇప్పటికే థియేటర్లలో సినిమా చూసిన వారు మరోసారి ఇంట్లో మూవీని ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక థియేటర్లలో మూవీని మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆతృతతగా ఎదురు చూస్తున్నారు. మరి థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story