ధర్మ ప్రొడక్షన్స్ తో సినిమా సైన్ చేసిన ప్రభాస్

Prabhas Signed the Film with Dharma Productions | Telugu Movie News
x

ధర్మ ప్రొడక్షన్స్ తో సినిమా సైన్ చేసిన ప్రభాస్

Highlights

ధర్మ ప్రొడక్షన్స్ తో సినిమా సైన్ చేసిన ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే బోలెడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ మరోవైపు అంతే స్పీడుగా సినిమాలు సైన్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సారి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఒక సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించబోతున్నాడు. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో అది రెండవ సినిమా అవుతుంది.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ "ప్రాజెక్ట్ కే" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ వెంటనే కరణ్ జోహార్ నిర్మిస్తున్న సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్", ఓం రౌత్ డైరెక్షన్లో "ఆది పురుష్", సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పూజ హెగ్డే లు హీరో హీరోయిన్లు గా నటించిన "రాధేశ్యామ్" సినిమా ఈ నెల జనవరి 14 న విడుదల కావాలి కానీ కరోనా కారణంగా సినిమాని విడుదలను వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories