Prabhas: ప్రభాస్‌ ఫేవరెట్‌ మూవీస్‌లో ఆ ఫ్లాప్‌ సినిమా కూడా.. ఇంతకీ ఏంటా సినిమా?

Prabhas Shocks Fans by Calling Adipurush One of His Favorite Movies Despite Flop
x

Prabhas: ప్రభాస్‌ ఫేవరెట్‌ మూవీస్‌లో ఆ ఫ్లాప్‌ సినిమా కూడా.. ఇంతకీ ఏంటా సినిమా?

Highlights

Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇక కల్కితో ఇది అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.

Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇక కల్కితో ఇది అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అంతలా ప్రభాస్‌ మార్కెట్‌ పెరిగిపోయింది. అయితే ఇలాంటి తరుణంలో వచ్చిన ఆది పురుష్‌ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకులేకపోయింది.

భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో నెగిటివిటీ జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్‌ అస్సలు బాగాలేరని, టెక్నికల్‌గా కూడా సినిమా ఫ్లాప్‌ అని విమర్శకులతో పాటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా వాపోయారు. అయితే ఇంతటి ఫ్లాప్‌ అయిన మూవీ కూడా తన ఫెవరేట్‌ మూవీస్‌లో ఒకటని ప్రభాస్‌ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైన 10 సినిమాల జాబితా చెప్పమన్న యాంకర్‌ ప్రశ్నకు స్పందిస్తూ అందులో ‘ఆదిపురుష్’ పేరును కూడా చేర్చడం విశేషం. దీంతో ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. చివరికి ప్రభాస్‌ అభిమానులకు కూడా నచ్చని సినిమా ప్రభాస్‌ తన ఫేవరెట్‌ మూవీస్‌లో ఒకటని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ఓ వైపు ది రాజా సాబ్‌ ముగింపు దశకు చేరుకోగా. కల్కి2, సలార్‌ 2 సినిమాలతో పాటు సందీప్‌ వంగ దర్శకత్వంలో స్పిరిట్‌, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ విడుదల కావడానికి ఎంత కాదన్నా కనీసం మరో 5 నుంచి 8 ఏళ్లు పట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories