Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Prabhas Salaar Teaser With Adipurush
x

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Highlights

Prabhas: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తున్నాడు హీరో ప్రభాస్

Prabhas: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తున్నాడు హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధే శ్యామ్ రెండు పాన్ ఇండియా సినిమాలే..ఇక బాక్సాఫీస్ ముందుకు రాబోతున్న ఆది పురుష్, సలార్, సెట్స్ మీదున్న ప్రాజెక్ట్ K, స్పిరిట్ కూడా నేషనల్ లెవల్ సినిమాలే..వీటిలో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఆదిపురుష్ సినిమాని రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ నిర్మాణ విలువల పరంగానే కాకుండా గ్రాఫిక్స్ పరంగానూ ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సంచలనం సృష్టించడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

ఆదిపురుష్ విశేషాలు ఇలా ఉంటే ప్రభాస్ లైనప్ లో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియెన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కుతుండడంతో అందరూ ఈ సినిమాపై ఫోకస్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. వారి అసహనాన్నీ దూరం చేసేస్తూ సలార్ టీజర్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

సలార్ చిత్రీకరణను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ హోంబలే ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో సలార్ టీజర్ ను ఆదిపురుష్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories