Salaar Movie: రీషూట్ చేస్తున్న "సలార్" బృందం

మళ్లీ షూటింగ్ అంటున్న "సలార్" డైరెక్టర్ (ఫైల్-ఫోటో)
Salaar: మళ్లీ షూటింగ్ అంటున్న "సలార్" డైరెక్టర్
Salaar Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ సినిమా ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మరొకసారి రీషూట్ చేస్తున్నారట. ఇప్పటికే ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. కానీ ఆ రెండు సన్నివేశాలు సినిమాకి చాలా కీలకం గా ఉంటాయని ఔట్పుట్ అంతగా బాగున్నట్టు అనిపించకపోవడం తో మళ్లీ షూట్ చేస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నారట. ఇదే విషయాన్ని నిర్మాతలతో చెప్పగా, నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారట. దీంతో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT