Prabhas: సలార్ తో ప్రభాస్ ఫామ్ లోకి వచ్చిన.. మారుతి సినిమా పై ఆగని డౌట్లు

Prabhas Salaar Movie Earned 9 Million In US
x

Prabhas: సలార్ తో ప్రభాస్ ఫామ్ లోకి వచ్చిన.. మారుతి సినిమా పై ఆగని డౌట్లు

Highlights

Prabhas: సలార్ మూవీ యూఎస్ లో 9మిలియన్లు రాబట్టింది. లాంగ్ రన్ లో పదిన్నర మిలియన్లు అంటే కనీసం 85 కోట్ల రాబట్టేలా ఉంది.

Prabhas: సలార్ మూవీ యూఎస్ లో 9మిలియన్లు రాబట్టింది. లాంగ్ రన్ లో పదిన్నర మిలియన్లు అంటే కనీసం 85 కోట్ల రాబట్టేలా ఉంది. ఓవరాల్ గా వెయ్యికోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. ఐతే ప్రభాస్ కి మాస్ యాక్షన్ జోనర్లు కలిసొచ్చినట్టు మిగతా కొత్త జోనర్లు కలిసి రావటంటున్నారు. మారుతీ మూవీ మీద అందుకే కొత్త డౌట్లు షురూచేశారు.

ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేస్తున్నాడు. మారుతి మేకింగ్ లో తను చేసే రాజా డీలక్స్ హర్రర్ కామిడీ అని కన్ఫామ్ అయినప్పటి నుంచి కొత్త భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు స్పిరిట్ లో మొదటి సారి పోలీస్ గా కనిపించనున్న ప్రభాస్ మీద ఆల్రెడీ పాత సెంటిమెంట్ దాడి చేస్తోంది. భయపెడుతోంది.

ప్రభాస్ మాస్ రూట్లోవెలితే వసూళ్ల వర్షం కురుస్తుంది. యాక్షన్ డ్రామాలు చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలా కాక కొత్త రూట్లో ప్రయోగం చేస్తే చేతులు కాలుతాయని, సాహో నుంచి ఆదిపురుష్ వరకు చాలా సార్లు రిజల్ట్ షాక్ ఇచ్చింది. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి ఒక్కటే మొట్ట మొదటి సారి చేసిన ప్రయోగం అయినప్పటికీ బాక్సాఫీస్ షేక్ అయ్యింది. కాకపోతే ఇందులో యాక్షన్ డ్రామాకి భారీ స్కోప్ ఉండటం వల్ల , పీరియాడికల్ డ్రామా అయినా మాస్ మతిపోగొట్టింది ఈ సినిమా. నిజానికి ప్రభాస్ చక్రం చేశాడు. పౌర్ణమిలో కూడా కదిలించబోయాడు. కాని ఏమైంది. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ డ్రామాలు చేస్తే పంచ్ పడటం తప్ప మరో ఆప్షన్ లేదని ప్రూవ్ అయ్యింది.

డార్లింగ్ ఎంత బాగున్నా, వసూళ్ల వరద రాలేదు. అంత భారీ కటౌట్ తో ఇలాంటి ప్రయోగాలు కరెక్ట్ కాదనే కామెంట్లే ఎక్కువ వచ్చాయి. అలాని రొటీన్ మాస్ కొట్టుడంటే బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రభాస్ జోనర్లు మార్చి మంచి ప్రయోగాలే చేస్తున్నాడు కాని, అదేంటో మాస్ రూట్లో వెళితే ఉన్న గ్యారెంటీ, తను మరో రూట్లో ఫస్ట్ టైం ఎన్నడూ చేయని పాత్ర చేస్తే మాత్రం దొరకదు.

మారుతి మూవీ హర్రర్ అనగానే ఇదేమౌతుందో అంటున్న జనమే, కల్కీ లాంటి సైఫై మూవీ కూడా ప్రభాస్ కి మొట్టమొదటి ప్రయోగమే.. సో వీటి రిజల్ట్ బట్టే తను మాస్ రూట్లో కంటిన్యూ అవుతాడా? ప్రయోగాలు కంటిన్యూచేస్తాడా అనేది తేలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories