"ప్రాజెక్ట్ కే" లో కే అంటే అదేనా?

Prabhas Role in Project K Movie | Telugu Movie News
x

"ప్రాజెక్ట్ కే" లో కే అంటే అదేనా? 

Highlights

Prabhas: కల్కి అవతారంలో కనిపించనున్న ప్రభాస్?

Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ లకు బ్రేక్ పడ్డప్పటికీ, ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో "ఆది పురుష్" మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్ట్ కే" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

అమితాబచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మహాభారతం ఆధారంగా ఉండబోతోందని, ప్రభాస్ పాత్రలో కల్కి పోలికలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అశ్వత్థాముడి జీవితచరిత్ర చుట్టూ ఈ కథ జరగబోతోందని తెలుస్తోంది. టైటిల్ "ప్రాజెక్ట్ కే" లో కూడా కే అంటే అర్థం కల్కి అవతారం అని సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories