Project K: భారీ మొత్తానికి అమ్ముడైన "ప్రాజెక్ట్ కే" నైజాం రైట్స్..

Sunil Is An Asian Who Spent Heavily On Project K Rights
x

"ప్రాజెక్ట్ కే" రైట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టిన ఏషియన్ సునీల్

Highlights

* భారీ మొత్తానికి అమ్ముడైన "ప్రాజెక్ట్ కే" నైజాం రైట్స్

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పటికే బోలెడు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్ట్ కే" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాపై రోజురోజుకీ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా రైట్స్ విలువ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా "ప్రాజెక్ట్ కే" నైజాం రైట్స్ ను ఏషియన్ సునీల్ సిండికేట్ వారు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిత్ర రైట్స్ కోసం ఏషియన్ వారు ఏకంగా 70 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని మరియు అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం మరియు ఇంగ్లీషులో భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories