ఆమిర్ ఖాన్ కోరిక మేరకు తన సినిమాని వాయిదా వేసిన ప్రభాస్

Prabhas Postponed his Film as Per Aamir Khan Wish | Tollywood News Today
x

ఆమిర్ ఖాన్ కోరిక మేరకు తన సినిమాని వాయిదా వేసిన ప్రభాస్

Highlights

*ఆమిర్ ఖాన్ కోరిక మేరకు తన సినిమాని వాయిదా వేసిన ప్రభాస్

Movie News: బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ త్వరలోనే "లాల్ సింగ్ చద్దా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి పోటీగా కన్నడ స్టార్ హీరోగా నటిస్తున్న "కే జి ఎఫ్ చాప్టర్ 2" రంగంలోకి దిగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా లాల్ సింగ్ చెడ్డ సినిమాతో పాటే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన సినిమాని వాయిదా వేస్తున్నట్లు గా సమాచారం అందుతోంది.

తాజాగా "లాల్ సింగ్ చద్దా" సినిమా ఆగస్టు 11 2022 న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే అదే రోజున "ఆదిపురుష్" సినిమా కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ "ఆది పురష్" చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ మరియు హీరో ప్రభాస్ తో చర్చలు జరిపి తమ సినిమాని వాయిదా వేయమని కోరారట. దానికి వారిద్దరూ కూడా ఒప్పుకోవడంతో లాల్ సింగ్ సినిమా కోసం తమ సినిమాని ఆది పురుష్ ని వాయిదా వేసేందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ని కూడా విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories