Top
logo

Adipurush - Release Date: ప్రభాస్ "ఆది పురుష్" విడుదల తేదీ ఖరారు

Prabhas New Movie Adipurush Release Date Confirmed by Director Om Raut and Producers | Cinema News Today
X

ప్రభాస్ "ఆది పురుష్" విడుదల తేదీ ఖరారు

Highlights

Adipurush - Release Date: సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు విడుదల తేదీని ప్రకటన

Adipurish - Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ డ్రామా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండగా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు విడుదల తేదీని ప్రకటించి దర్శకనిర్మాతలు సర్ప్రైజ్ ఇచ్చారు.

"ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11 విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుండగా "సలార్" సినిమా ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు "ఆది పురుష్" కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. అంటే 2022 లో ప్రభాస్ 3 సినిమాలు విడుదల చేయబోతున్నారు. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన "ఆది పురుష్" సినిమాకి సాచెత్-పరంపర సంగీతాన్ని అందించారు.

Web TitlePrabhas New Movie Adipurush Release Date Confirmed by Director Om Raut and Producers | Cinema News Today
Next Story