Radhe Shyam Movie: సరికొత్త ఎక్స్‌పెరిమెంట్..మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు

Radhe Shyam
x

 Radhe Shyam

Highlights

రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా'రాధేశ్యామ్‌' షూటింగ్ చివరిదశకు చేరింది. ఇప్పటికే ఈ సినిమా ఓ టాక్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. తాజాగా...

రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా'రాధేశ్యామ్‌' షూటింగ్ చివరిదశకు చేరింది. ఇప్పటికే ఈ సినిమా ఓ టాక్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. తాజాగా రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ పై చిత్ర యూనిట్ పెద్ద కసరత్తే చేసింది. ఈ సినిమా సాంగ్స్ పై దృష్టి పెట్టిన సినిమా యూనిట్ హిందీలో ఈ సినిమాకు ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేయిస్తోంది. మ్యూజిక్ విష‌యంలో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల అభిరుచికి, ద‌క్షిణాది ప్రేక్ష‌కుల అభిరుచి ఉన్న తేడా కార‌ణంగానే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇలాంటి ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు హిందీ వెర్ష‌న్‌కు ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేస్తున్నారు. మిథున్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రెండు సాంగ్స్, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ ఒక పాట‌కు సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు,తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాట‌ల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతాన్ని అందిస్తాడ‌ట‌. ప్రభాస్‌ జోడీగా పూజా హెగ్డే నటించనుంది. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రాధేశ్యామ్‌ రూపొందుతోంది.

కృష్ణంరాజు, ప్ర‌భాస్‌పై కొన్ని సీన్స్ చిత్రీక‌రించాల్సి ఉంద‌ని సమాచారం‌. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ ప‌రంగా చిత్ర యూనిట్ ఓ పెద్ద సహాసం చేస్తుందనే చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోకు ఉత్తరాధి దర్శకులు పనిచేయడంతో తెలుగు ఆడియన్స్ కు మ్యూజిక్ పెద్దగా కనెట్ట్ కాలేదని.. అందుకే ఈ ప్రయోగం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వగ్గాల్లో టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories