తారక రత్న తో నటించే అవకాశం కోల్పోయిన ప్రభాస్..

Prabhas Lost the Chance to Act with Taraka Ratna
x

తారక రత్న తో నటించే అవకాశం కోల్పోయిన ప్రభాస్..

Highlights

*నందమూరి హీరో తో సినిమా ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్..

Nag Ashwin: నందమూరి హీరో లలో ఒకరైన నందమూరి తారక రత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులు కూడా తారక రత్న అకాల మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తారక రత్న లేని లోటు నందమూరి కుటుంబానికి మాత్రమే కాక ఇండస్ట్రీ లో కూడా ఎవరూ భర్తీ చేయలేరు.

2003 లో "ఒకటో నంబర్ కుర్రాడు" సినిమాతో అశ్విని దత్ నిర్మాణంలో హీరోగా మారిన తారక రత్న ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ, గెలుపు ఓటమి లను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్లేవారు. ఒక నటుడిగా మాత్రమే కాక తారక రత్న ను ఒక వ్యక్తిగా కూడా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "ప్రాజెక్ట్ కే" సినిమా లో తారకరత్న ను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేయాలని అనుకున్నట్లు నిర్మాత అశ్విని దత్ అంటున్నారు.

ఈ పాత్ర గురించి ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్‌తో తాను చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు అశ్విని దత్. కానీ అప్పుడే జనవరి 27న తారక రత్న భారీ కార్డియాక్ అరెస్ట్‌ కు గురవ్వడంతో విధి వేరే ప్రణాళికలను వేసుకుంది అని అశ్విని దత్ బాధపడ్డారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారక రత్న ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. 39 ఏళ్ల వయసులోనే తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories