Kalki Movie: కల్కి మరో అరుదైన ఘనత.. పఠాన్‌ మూవీని వెనక్కి నెట్టి మరీ..

Prabhas kalki movie sets new record in overseas collections
x

Kalki Movie: కల్కి మరో అరుదైన ఘనత.. పఠాన్‌ మూవీని వెనక్కి నెట్టి మరీ.. 

Highlights

Kalki Movie: కల్కి మరో అరుదైన ఘనత.. పఠాన్‌ మూవీని వెనక్కి నెట్టి మరీ..

Kalki Movie: ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వండర్స్‌ క్రియేట్ చేసింది. విడుదలైన ప్రతీ చోటా ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. వెయ్యి కోట్లు కొల్లగొట్టింది.

రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా పలు అరుదైన రికార్డనుల సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌ మార్కెట్లో కల్కి సంచలనం సృష్టించింది. విడుదకు ముందు నేంచే నార్త్‌ అమెరికాలో హంగామా చేసిన కల్కి మూవీ తాజాగా మరో అరుదైన మైలురాయిని దాటేసింది. అమెరికాలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన రెండో ఇండియన్‌ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది కల్కి మూవీ. షారుక్‌ ఖాన్‌ హీరో నటించిన పఠాన్‌ కలెక్షన్లను దాటేసిందీ మూవీ.

ఇప్పటి వరకు 18.5మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసి నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో షారుక్‌ నటించిన ‘పఠాన్‌’ 17.45 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలోఉండగా.. తాజాగా ‘కల్కి’ ఆ చిత్రాన్ని దాటేసింది. ఇదిలా ఉంటే కల్కి మూవీ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కొంతమంది అభిమానుల కోసం కల్కి స్పెషల్‌ షోను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. అమితాబ్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కల్కి టీమ్‌ కొంత మందితో ఒక షోన్‌ ప్లాన్‌ చేస్తోందని ఇప్పటికే.. ఇందుకు సంబంధించి పనులు కూడా మొదలయ్యాయని రాసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ఇంకా ప్రణాళిక దశలోనే ఉందని, ఇది ఫలించొచ్చు.. విఫలమవ్వచ్చు అని రాసుకొచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories