ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్న ప్రభాస్

ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్న ప్రభాస్
ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్న ప్రభాస్
Prabhas: "బాహుబలి" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2019లో "సాహో" సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ, కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ గా మారింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ వెండితెరపై కనిపించింది లేదు. కానీ ప్రభాస్ చేతులో మాత్రం బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎట్టకేలకు అందులో కొన్ని ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చి విడుదలకు సిద్ధమవుతున్నాయి. కేవలం 2022 లోనే ప్రభాస్ కు రెండు విడుదలలు ఉన్నాయి. అందులో మొదటిది "రాధేశ్యామ్". రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడి ఇప్పుడు మార్చి 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక మరోవైపు మీడియం బడ్జెట్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తిచేసి సినిమాని ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2023 లో కూడా ఏడాది మొదట్లోనే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తన "ఆదిపురుష్" సినిమాను విడుదల చేయబోతున్నారు ప్రభాస్. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMT