కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?
x
Highlights

Prabhas poster from Kannappa movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు...

Prabhas poster from Kannappa movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటుల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లను రిలీజ్ చేశారు. కానీ ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తాజాగా కన్నప్ప చిత్ర బృందం ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 3న రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నామని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఆ పోస్టర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే ఆయన త్రిశూలం పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. నుదిటిపై విభూది, దానిపై ఎర్రటి తిలకం మండుతున్నట్టుగా ఉండడంతో ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై క్యూరియాసిటీని పెరిగింది.

ఇప్పటికే మూవీ నుంచి మంచు విష్ణు నుంచి మొదలుకొని మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ సహా పలువురి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను మాత్రమే ఇందులో సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో ప్రభాస్‌ని చూడడానికి అందరిలో స్పెషల్ బజ్ ఏర్పడింది. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన హాఫ్ పోస్టర్‌లో.. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ప్రభాస్ విభిన్నంగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ప్రభాస్ నంది పాత్రలో కనిపించబోతున్నారు అంటూ టాక్ నడుస్తోంది.

ముఖేష్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కన్నప్ప మూవీని అవా ఎంటర్టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను చాలా వరకు న్యూజిలాండ్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories