Kannappa: పోస్టర్ అదిరింది.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Prabhas First Look In Kannappa movie
x

పోస్టర్ అదిరింది.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Highlights

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. అత్యంత భారీ బడ్జెట్‌తో ‌రూపొందుతున్న ‌ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నారు. ‌

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. అత్యంత భారీ బడ్జెట్‌తో ‌రూపొందుతున్న ‌ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నారు. ‌ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజాగా ప్రభాస్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూసిన ఫ్యాన్స్‌ పోస్టర్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఏ పాత్రలో కనిపిస్తారు..? ఆయన లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మొదట ప్రభాస్ శివుని పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల అక్షయ్ కుమార్ శివుని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ పాత్ర ఏంటా అని చర్చ జరిగింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా చెప్పినట్టుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ మెడలో రుద్రాక్షలు, కాషాయ దుస్తులు, పెద్ద జుట్టుతో కనిపించారు. దీంతో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నట్టు కార్లిటీ వచ్చింది.

ఈ మూవీలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఇటీవల వీరిద్దరి పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మధుబాల నటిస్తున్నారు. అంతేకాదు విష్ణు కూతుర్లు, కొడుకు సైతం కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories