logo
సినిమా

Prabhas: ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Prabhas Film with a Budget of 400 Crores | Tollywood News
X

ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Highlights

Prabhas: త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న "ప్రాజెక్ట్ కే"

Prabhas Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చిలో విడుదల కాబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమా సైన్ చేసిన ప్రభాస్ "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్ట్ కే" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఈ సినిమా కోసం ఏకంగా 4 వందల కోట్లు బడ్జెట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం చిత్ర బృందం భారీ బడ్జెట్ తో పెద్ద పెద్ద సెట్స్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్", ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", మరియు మారుతి డైరెక్షన్లో "రాజా డీలక్స్" సినిమాలు కూడా సైన్ చేశారు ప్రభాస్.

Web TitlePrabhas Film with a Budget of 400 Crores | Tollywood News
Next Story