Top
logo

బాహుబలి సెంటిమెంట్ ని నమ్ముకున్న ప్రభాస్ ..

బాహుబలి సెంటిమెంట్ ని నమ్ముకున్న ప్రభాస్ ..
X
Highlights

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గా సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్.. తాజాగా...

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గా సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్.. తాజాగా వచ్చిన సాహో సినిమా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసారు. ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నప్పటికీ భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

దీనికి జాన్ అనే టైటిల్ ని పెట్టనున్నట్లు వినిపిస్తుంది. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతుందని సమాచారం.. ఇందులో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు సమాచారం..

Next Story