అలాంటి డైరెక్టర్లకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న ప్రభాస్

Prabhas Decided to Stay away From Such Directors
x

 అలాంటి డైరెక్టర్లకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న ప్రభాస్

Highlights

అలాంటి డైరెక్టర్లకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న ప్రభాస్

Prabhas: ఈ మధ్యనే రాధే శ్యామ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. "బాహుబలి" సినిమా తర్వాత వచ్చిన "సాహో" మరియు "రాధే శ్యామ్" లతో ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో మొదటిది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా.

రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఇంతకుముందు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశారు. గతంలో ఒక సినిమా చేసిన డైరెక్టర్లతో ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ సినిమాలకు పనిచేశారు కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. దీంతో కేవలం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్న డైరెక్టర్లతో పని చేయడానికి ప్రభాస్ కొంచెం తడబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కాకుండా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్టు కే" మరియు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" లో, సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్" సినిమాలలో నటిస్తున్నారు ప్రభాస్. కానీ ఈ ముగ్గురికీ రెండు కంటే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. కానీ ఓం రౌత్ విషయంలో అలాకాదు. దీంతో ప్రభాస్ కూడా ముంబై వెళ్లి స్వయంగా ఈ సినిమా ప్రోగ్రెస్ విషయంలో సహాయం చేస్తూ బాలీవుడ్లో కూడా మరికొన్ని సినిమాలు సైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories