logo
సినిమా

Prabhas: పుష్ప" ని ప్రమోట్ చేయబోతున్న బాహుబలి

Prabhas Coming as Chief Guest to Pushpa Pre Release Event
X

పుష్ప ప్రీ రిలేస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గ రానున్న ప్రభాస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Prabhas: "పుష్ప" కోసం ప్రభాస్ ను సంప్రదించనున్న బన్నీ

Prabhas: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమా లోని మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అనసూయ, సునీల్ మరియు ఫాహద్ ఫాసిల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ వెళ్తున్నా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు.

ముందుగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో నిర్వహించాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ ఇప్పటికే విడుదల తేది దగ్గర పడుతోంది కానీ ఇంకా ప్రొడక్షన్ పనులు అలానే ఉండడంతో దర్శక నిర్మాతలు ఈ వేడుకని హైదరాబాద్లోనే జరపాలని నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా ఈ వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా పిలవాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన "రొమాంటిక్" సినిమా కోసం బాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ అల్లుఅర్జున్ "పుష్ప" కోసం ఈ వేడుకకి హాజరు అవుతారో లేదో చూడాలి.

Web TitlePrabhas Coming as Chief Guest to Pushpa Pre Release Event
Next Story