Prabhas Birthday: దేశ విదేశాల్లో పండగ చేసుకుంటున్న రెబెల్ స్టార్ ఫ్యాన్స్


Prabhas Birthday special
Prabhas Birthday special: ప్రభాస్ బర్త్ డే వేడుకలను ఇండియాలోనే కాదు విదేశాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Prabhas Birthday special story: హీరోల బర్త్ డే వచ్చిందంటే చాలు ఫ్యాన్స్‌కి పండుగే.. ఎందుకంటే ఆ రోజు కొత్త సినిమాల అప్‌డేట్స్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇందులో రెబల్ స్టార్ డార్లింగ్ బర్త్ డే అంటే ఇక మామూలుగా ఉండదు. అక్టోబర్ 23న ఆయన 45వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే వేడుకలను ఇండియాలోనే కాదు విదేశాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డార్లింగ్ సినిమాలు విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ హీరో సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా పండగ చేసుకుంటారు. విదేశాల్లో ఇప్పటివరకు విడుదలైన ప్రభాస్ సినిమాలన్ని భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి.
ప్రభాస్.. ఉప్పలపాటి సూర్యనారాయణ జు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టాడు ప్రభాస్. మొదటి సినిమానే కాకుండా రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సిరీస్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రెండు వేల కోట్ల కలెక్షన్లు సాధించగలదని ఈ సినిమాలతో ప్రభాస్ నిరూపించాడు.
ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డార్లింగ్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇక జపాన్‌లోనూ డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా జపాన్‌లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాను రీరిలీజ్ చేసి అడ్వాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే రాధేశ్యామ్ రీరిలీజ్ థియేటర్లలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని రచ్చ చేశారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ పెద్ద పెద్ద బ్యానర్స్ పట్టుకుని థియేటర్లలో హడావిడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే గత కొంతకాలంగా హీరోల పుట్టిన రోజులకు వారికి సంబంధించిన పాత చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. డార్టింగ్ బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పాత సినిమాలను మళ్లీ విడుదల చేయనున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈశ్వర్, సలార్, రెబల్, మిర్చి, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో డార్లింగ్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. మరోవైపు ప్రభాస్ బర్త్ డే రోజున తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ వస్తాయని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
బాహుబలి-2 తర్వాత వరుస ప్లాపులను అందుకున్న ప్రభాస్.. సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ సక్సెస్‌లను అందుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రభాస్‌కు భారత్‌తో పాటు జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 2017లో బాహుబలి విజయం సాధించిన తర్వాత బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో ఈ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి దక్షిణాది నటుడిగానూ ప్రభాస్ పేరు రికార్డులకెక్కింది.
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ కథానాయికలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ న్యూ లుక్‌లో కనిపించబోతున్నట్టు రాజాసాబ్ బృందం చెబుతోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ ప్రకటించనున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ మన డార్లింగ్ ముందుంటాడు. గత ఇరవై ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్-19, తుఫాన్లు, వరదలు వంటి విపత్తుల సమయంలో భారీగా విరాళాలు అందించారు. 2020లో ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 16 వందల 50 ఎకరాలను దత్తత తీసుకుని దాని అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈకో పార్క్‌ను తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట అభివృద్ధి చేయడానికి ఆర్థిక సాయం అందించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. దటీజ్ ప్రభాస్ ..

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



