Prabhas: క్రేజీ కాంబినేషన్‌.. కుర్ర దర్శకుడితో ప్రభాస్‌?

Prabhas: క్రేజీ కాంబినేషన్‌.. కుర్ర దర్శకుడితో ప్రభాస్‌?
x

Prabhas: క్రేజీ కాంబినేషన్‌.. కుర్ర దర్శకుడితో ప్రభాస్‌?

Highlights

Prabhas: ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల ఘన విజయం తర్వాత ప్రభాస్‌ తన కెరీర్‌లో మరింత వేగం పెంచారు.

Prabhas: ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల ఘన విజయం తర్వాత ప్రభాస్‌ తన కెరీర్‌లో మరింత వేగం పెంచారు. వరుస సినిమాలతో బిజీగా మారిన ఆయన, కొత్త కథల్ని కూడా ఓకే చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా, మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ‘హను-మాన్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ, ఇప్పుడు ప్రభాస్‌తో ఓ భారీ చిత్రం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇలా వార్తలు వచ్చాయో లేదో, అలా అంచనాలు పెరిగిపోయాయి. కాగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రశాంత్‌ వర్మ కథలు రాసే విధానం, విజువల్‌ ప్రెజెంటేషన్‌ విభిన్నంగా ఉంటాయని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆయన స్టైల్‌లో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే, ప్రభాస్‌ నటించిన ‘రాజాసాబ్‌’ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ‘సలార్‌’ రీ-రిలీజ్‌ను మాత్రం అభిమానులకు కానుకగా మార్చి 21న థియేటర్లలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories