వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమాలు లేనట్టే?

వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమాలు లేనట్టే?
x
Prabhas, Megastar chiranjeevi(file photo)
Highlights

కరోనా వల్ల దేశవ్యాప్తంగా అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.

కరోనా వల్ల దేశవ్యాప్తంగా అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.. మరికొన్ని సినిమాలు విడుదలకి సిద్దంగా ఉండి ఆగిపోయాయి. దీనితో పరిస్థితి గందరగోలంగా తయారైంది. ఈ నేపధ్యంలో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్న ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి ఆచార్య సినిమాలు విడుదలవుతాయా అనే అనుమానం మొదలైంది.

చిరంజీవి కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఆచార్య సినిమా ఇంకా 60 శాతం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో నెలన్నర నుంచి రెండు నెలలు వుంటుందని తెలుస్తోంది. ఇక ఇది కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ ఉంటుందని ముందునుంచే చిత్రబృందం చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఒకపక్కా రామ్ చరణ్ మాత్రం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. మరి ఆచార్యకి చరణ్ ఎలా డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తాడు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మిగిలింది. దీనితో ఆచార్య సంక్తాంతికి డౌటే అనే అనుమానం కలుగుతుంది.

ఇక ప్రభాస్ సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అంతేకాకుండా ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపిచడం లేదు. సో ఈ సినిమా కూడా సంక్రాంతికి రావడం కష్టమే అని వినిపిస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక సంక్రాంతికి అన్ని విధాలుగా రెడీ అయి ఉంది పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే..ఎలాగు తెలంగాణ ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది కాబట్టి వకీల్ సాబ్ చకచక ఆ పనులు పూర్తి చేసుకోని సంక్రాంతి బరిలో దిగొచ్చు..ఇక యంగ్ హీరో నితిన్ సినిమా రంగ్ దే కూడా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం వుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories