Prabhas Adipurush Movie Update: 'ఆదిపురుష్' విలన్ ఎవరో తెలుసా?


Prabhas Adipurush Movie Update | రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల చాలా పెద్ద సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
Prabhas Adipurush Movie Update | రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల చాలా పెద్ద సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంల 'ఆదిపురుష్' అనే భారీ చిత్రం తెర కెక్కనున్నట్టు ప్రకటించారు. 'ఆదిపురుష్ ' సినిమా పేరే కాదు.. 'చెడు మీద మంచి సాధించిన విజయం' అనే ట్యాగ్ లైన్ కూడా అభిమానుల్లో మరింత ఉత్సహాన్ని రేపుతుంది. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం.. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటం.. ఈ చిత్రంలో ప్రభాస్.. రాముడి పాత్రను పోలిన పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
అయితే, ఇపుడు ప్రభాస్ నటిస్తున్న భారీ ఇతిహాస చిత్రం "ఆదిపురుష్" చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ రానుంది అని దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. దీనితో అది ఏమిటా అని మొత్తం సినీ ప్రపంచం ఈరోజు ఉదయం కోసం ఎదురు చూసింది. ఓం రౌత్ చెప్పిన సమయానికే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ ను రివీల్ చేసారు. "7000 వేల సంవత్సరాల కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భవించాడు" అని ట్వీట్ చేసారు.
ఈ చిత్రంలో రావణ పాత్రను పరిచయం చేయడం కోసమే ఈ అప్ డేట్ అని తెలుస్తుంది. ప్రతినాయకుడు రావణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని, ఆ పాత్రలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, ఇపుడు అతన్ని కూడా ఓంరౌత్ ట్యాగ్ చేసి సైఫ్ ను లంకేశునిగా చూపించనున్నట్టు ఖరారు చేసారు. ఈ భారీ చిత్రాన్ని ఓంరౌత్ 500 కోట్లకు పైగా బడ్జెట్తో 3డి లో తెరకెక్కించనున్నారు అని.. ఈ చిత్రంలో సీతగా దీపికా పాడుకొనేదీపికా పదుకొనె నటించనుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ చిత్ర షూటింగ్ 2021లో ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగేస్తుందో చూడాలి.
PRABHAS & SAIF... #SaifAliKhan to portray #Lankesh - the menacing villain - in #Adipurush [3D]... Stars #Prabhas as #Adipurush... Directed by #OmRaut... Produced by Bhushan Kumar, Krishan Kumar, Om Raut, Prasad Sutar and Rajesh Nair. #Prabhas22 pic.twitter.com/58OruNBcSR
— Shreyas Group (@shreyasgroup) September 3, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



