Top
logo

''వైరస్ మనుషుల మధ్య వస్తే మన కర్మ అంటారు.. అదే వైరస్ మనిషి రూపంలో వస్తే''.. అబ్బో ఆర్జీవీని బాగానే కెలికారుగా!

వైరస్ మనుషుల మధ్య వస్తే మన కర్మ అంటారు.. అదే వైరస్ మనిషి రూపంలో వస్తే.. అబ్బో ఆర్జీవీని బాగానే కెలికారుగా!
X
adirindi show latest promo (image courtesy zee telugu youtube)
Highlights

Power punches on RGV రామ్ గోపాల్ వర్మతో పెట్టుకోవడం అంటే కెలికి ఇరుక్కోవడం.. అదిరింది తాజా ప్రోమోలో వర్మ పై సెటైర్ లు కనిపిస్తున్నాయి!

ఆర్జీవీ అంటే కెలకడం అనే పదానికి పర్యాయపదంగా మారిపోయింది. ఎవరినైనా కెలికి.. వాళ్ళ మీదనే సినిమా తీసి.. వాళ్ళ తోనే పబ్లిసిటీ చేయించుకుని సోమ్ముచేసుకోవడంలో వర్మ తీరే సెపరేటు. తాజాగా ఈమధ్యనే పవర్ స్టార్ పేరుతొ మెగా ఫ్యాన్స్ ని కెలికి వదిలేశారు. పైగా తాను తీసిన సినిమా విషయంలో ఎవరికైనా దమ్ముంటే తన ఆఫీసుకు వచ్చి తెల్చుకోవలంటూ బహిరంగ సవాలూ విసిరారు. దీంతో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అయన ఆఫీసుకు వెళ్ళారు. పాపం వాళ్లకు తెలీదు తన సినిమాకి ప్రచారం కోసం వారిని వాడుకుంటున్నారని. దాదాపు రెండుగంటల సేపు వాళ్ళని కూచోపెట్టి విసిగించి వాళ్ళు అల్లరిచేసాకా వాళ్ళపై కేసు పెట్టి.. మీడియా దృష్టి ఆకర్షించి తనకు కావలసిన ప్రచారం చేయించుకున్నారు వర్మ.

ఇవన్నీ తెలిసే వర్మ పవర్ స్టర్ పై సినిమా అన్నా కూడా మెగా ఫ్యామిలీ లైట్ తీసుకుంది. సినిమా తీస్తున్నాను అన్నప్పుడు కానీ.. టీజర్ లు వదిలినప్పుడు కానీ.. సినిమా వచ్చాకా కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆఖరుకు పవన్ మీద యీగ వాలినా సహించని నాగబాబు కూడా సైలెంట్ గా ఉన్నారు. వర్మ సినిమాలు ముందు హడావుడి తప్ప విషయం ఉండదని వారికీ తెలుసు. అలాగే జరిగింది కూడా.. సినిమా వచ్చింది.. వెళ్ళింది.. రెండురోజులు హడావుడి.. ఇప్పుడు ఎవరికీ అది గుర్తుకూడాలేదు.

అయితే, ఇప్పుడు ఆర్జీవీ పై పంచులు వేశారు నాగబాబు షోలో. అవును. అదిరింది షోలో భాగంగా వచ్చిన ఓ స్కిట్ లో.. వర్మ స్టైల్ లోనే ''ఇదంతా కల్పితం..ఎవర్నీ ఉద్దేశించింది కాదు'' అంటూనే.. వర్మ పై తీవ్రమైన సెటైర్ లు వేశారు. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది..

అదిరింది షోలో భాగంగా ఓ స్కిట్లో.. వైరస్ మనుషుల మధ్య వస్తే మన కర్మ అంటారు.. అదే వైరస్ మనిషి రూపంలో వస్తే.. అంటూ ఒక పాత్రధారి తన స్నేహితునితో అంటాడు. దానికి ఆ రెండో వ్యక్తీ 'రేయ్ సరిగ్గా మాట్లాడరా.. నేను ఆయన ఫ్యాన్‌ని' అని గట్టిగా చెబుతాడు. 'ఏంటి పక్కోళ్ల ఫ్యాన్స్‌కి కెలికేవాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారా??' అని పంచ్ వేస్తాడు మొదటి వ్యక్తీ.. అంతేనా..''మన ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ సినిమా తీసినా రికార్డ్‌లు కొట్టేలా ఉంటాయి.. అదే మీ వాడు తీస్తే.. ఆయన్నే కొట్టేలా ఉంటాయి'' అంటూ గట్టి సెటైర్ వేశాడు. దీనికి నాగబాబు పడీ పడీ నవ్వడం ప్రోమోలో కనిపించింది.

మొత్తమ్మీద కెలకడం అనేది ఆర్జీవీకి మాత్రమె కాదు.. చాలా మందికి వచ్చన్నమాట! ఇప్పుడు దీనికి వర్మ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి అసలు అదేమిటో మీరూ చూసేయండి!


Web TitlePower punches on RGV by adirindi show team released promo creating fun and interest
Next Story