పవన్ కళ్యాణ్ కి నో చెప్పి విజయ్ దేవరకొండ కి ఓకే చెప్పిన పూజా హెగ్డే

Pooja Hegde Says No to Pawan Kalyan Movie | Tollywood News
x

పవన్ కళ్యాణ్ కి నో చెప్పి విజయ్ దేవరకొండ కి ఓకే చెప్పిన పూజా హెగ్డే

Highlights

*పవన్ కళ్యాణ్ కి నో చెప్పి విజయ్ దేవరకొండ కి ఓకే చెప్పిన పూజా హెగ్డే

Pooja Hegde: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లు పూజాహెగ్డే పేరు ముందే ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "భవదీయుడు భగత్ సింగ్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన "డిజే" సినిమాతోనే తన కెరీర్లో అతి పెద్ద బ్రేక్ అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని ఈ సినిమాని తిరస్కరించినట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ వారిద్దరి కాంబినేషన్ లోనే "జనగణమన" అనే సినిమా తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్ సినిమాకి నో చెప్పి విజయ్ దేవరకొండ సినిమా కి పూజ హెగ్డే ఓకే చెప్పడానికి కారణం కూడా ఉందట.

పవన్ కళ్యాణ్ సినిమా లో కమర్షియల్ హీరోయిన్గా నటించడం కంటే విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ సినిమాల్లో నటించటం తన కరియర్ కి ఉపయోగపడుతుందని పూజా హెగ్డే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పూజా హెగ్డే కి విజయ్ దేవరకొండ నటిస్తున్న "జనగణమన" వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలో నటించటం బాగా హెల్ప్ అవుతుందని పూజా హెగ్డే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories