logo
సినిమా

బాలీవుడ్లో నేపోటిజం గురించి కామెంట్లు చేసిన పూజా హెగ్డే...

Pooja Hegde Comments on Bollywood Nepotism | Tollywood Gossips
X

బాలీవుడ్లో నేపోటిజం గురించి కామెంట్లు చేసిన పూజా హెగ్డే...

Highlights

Pooja Hegde: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజాహెగ్డే కూడా ఒకరు...

Pooja Hegde: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజాహెగ్డే కూడా ఒకరు. "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ ఈమె చేతిలో ఇప్పటికీ బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు టాలీవుడ్లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే సుపరిచితురాలే. హృతిక్ రోషన్ సరసన "మొహెంజోదారో" సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమాతో హిట్ అందుకోలేకపోయింది.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో నేపోటిజం గురించి కామెంట్లు చేసింది పూజా హెగ్డే. తన బాలీవుడ్ గురించి అడగగా, కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజ. "కొంత మంది స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వచ్చాయి కానీ స్క్రిప్ట్ లో నా పాత్రలు అంత స్ట్రాంగ్ గా లేవు. మనకి సినిమా బాక్గ్రౌండ్ లేకపోతే బాలీవుడ్లో నిలదొక్కుకోవడం కొంచెం కష్టం. నచ్చిన పాత్రలు దొరకడానికి చాలా సమయం పడుతుంది.

కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత మనిషి లా ఆదరించటం ఒక పెద్ద వరంగా భావిస్తున్నాను. నా కెరీర్ కు కావలసినంత బలం సౌత్ ఇండస్ట్రీనే ఇచ్చింది" అని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. నిజానికి అల్లు అర్జున్ డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. కానీ పూజా హెగ్డే మాత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా తర్వాతే ప్రేక్షకులు తన ని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారని అని, ఆ సినిమా తర్వాత ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వస్తున్నాయని అంటోంది ఈ భామ.

Web TitlePooja Hegde Comments on Bollywood Nepotism | Tollywood Gossips
Next Story