ఆచార్య లో కనీ కనిపించకుండా ఉన్న హీరోయిన్లు

Pooja Hegde and Kajal Agarwal Character in Acharya Movie | Telugu Movie News
x

 ఆచార్య లో కనీ కనిపించకుండా ఉన్న హీరోయిన్లు

Highlights

ఆచార్య లో కనీ కనిపించకుండా ఉన్న హీరోయిన్లు

Acharya Movie: పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. అయితే గత కొంతకాలంగా ఈమె చేస్తున్న పాత్రలు చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ పూజా హెగ్డే ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతోంది. ఇక ఈ మధ్యనే విడుదలైన "బీస్ట్" సినిమాలోనూ పూజాహెగ్డే కి పెద్ద మంచి పాత్ర ఏమీ దొరకలేదు. ఇటు ఆచార్య ట్రైలర్ లో కూడా పూజా హెగ్డే పాత్ర కి అంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో పోషిస్తున్న సోనూసూద్ కూడా కేవలం అక్కడక్కడా మాత్రమే కనిపించారు. ఇక సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా కనిపించనుంది. కానీ ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ అయితే ఒక్కసారి కూడా కనిపించలేదు. అయితే కాజల్ అగర్వాల్ పాత్ర ఈ సినిమాకు స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉండబోతోందని, అందుకే చిత్ర దర్శక నిర్మాతలు ఆమె పాత్రను ట్రైలర్ లో కూడా చూపించలేదని కొందరు అంటున్నారు.

ఇక మరోవైపు మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చుట్టూ కథ తిరుగుతుంది అని పూజా హెగ్డే మరియు కాజల్ అగర్వాల్ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదని ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోయిన్ల పాత్రలను సైడ్ లైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories