తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న "పొన్నియిన్ సెల్వన్"

Ponniyin Selvan Completed the Shooting in a Short Period of Time.
x

తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న "పొన్నియిన్ సెల్వన్"

Highlights

Mani Ratnam: "పొన్నియిన్ సెల్వన్" షూటింగ్ అప్పుడే పూర్తయిపోయిందా

Mani Ratnam: తమిళ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పొన్నియిన్ సెల్వన్". ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఒక పౌరాణిక చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చాలా మంది సినీ ప్రముఖులు, స్టార్ నటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసి మణిరత్నం ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం రెండు పార్ట్ లను కూడా మణిరత్నం కేవలం 140 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పేర్కొన్నారు. ఈ మధ్యనే హైదరాబాదులో ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసింద ఇక సినిమా గురించి మాట్లాడుతూ భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ రెండు భాగాల షూటింగ్ చాలా తక్కువ రోజుల్లో పూర్తయినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలకే సిద్ధమవుతోంది. తెలుగులో సినిమాపై భారీ అంచనాలు లేకపోయినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు బాహుబలి వంటి సినిమాని రాజమౌళి దాదాపు ఐదేళ్లు తీశారని, కానీ మణిరత్నం ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories