Saif Ali Khan: అతనికి సైఫ్ పై దాడితో సంబంధం లేదు: ముంబై పోలీసులు

Saif Ali Khan: అతనికి సైఫ్ పై దాడితో సంబంధం లేదు: ముంబై పోలీసులు
x
Highlights

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ దాడితో సంబంధం లేదని ముంబై పోలీసులు ప్రకటించారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ దాడితో సంబంధం లేదని ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని పోలీసులు బాంద్రాలో అరెస్ట్ చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి ఈ కేసుతో సంబంధం లేదని విచారణలో పోలీసులు గుర్తించారు. మరో వైపు ఈ ఘటనకు అండర్ వరల్డ్ గ్యాంగ్ తో ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి యోగేష్ కదం మీడియాకు చెప్పారు.

సైఫ్ అలీఖాన్ పై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగారు. సీసీటీవీలో దాడికి దిగిన వ్యక్తిని గుర్తించారు. బాంద్రా రైల్వే స్టేషన్ లోని సీసీటీవీల్లో అతడిని గుర్తించారు. బాంద్రా పోలీసులు శుక్రవారం ఉదయం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ పై దాడి కేసులో అతడిని అనుమానించారు. ఈ విషయమై ఆయనను ప్రశ్నించారు.దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

సైఫ్ పై దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ముంబైలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. దాడి ఎందుకు జరిగింది? దాడికి పాల్పడింది ఎవరు? భద్రత ఉన్న ఇంట్లోకి అతను ఎలా వచ్చారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories