చిక్కుల్లో ప్రముఖ నటి.. పోలీస్ కేసు నమోదు

చిక్కుల్లో ప్రముఖ నటి.. పోలీస్ కేసు నమోదు
x
Myna Nandhini File Photo
Highlights

సోషల్ మీడియా యుగం కావడంతో చాలా మంది సినీ, రాజకీయా, క్రీడారంగ ప్రముఖులు అభిమానులకు ఉంటున్నారు. అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఫేస్...

సోషల్ మీడియా యుగం కావడంతో చాలా మంది సినీ, రాజకీయా, క్రీడారంగ ప్రముఖులు అభిమానులకు ఉంటున్నారు. అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ సోషల్ యాప్స్ లో సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ , తరచూ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇవే ఓ నటికీ తలనొప్పి తీసుకొచ్చింది. ఏకంగా పోలీసులు కేసు పెట్టేవరకు వెళ్లింది.

ఓ ప్రముఖ తమిళ టీవీ నటిగా మంచి పేరు సంపాదించిన మైనా నందిని తమిళనాడులో కేసు నమోదైంది. ఫేస్ బుక్ ఖాతాలో చేసిన తప్పుకు పోలీసుల కేసు వరకు వెళ్లింది. ఆమె వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా ఒకటి క్రికెట్ చేశారు. అయితే అందులో ఆమె ఫోన్ నెంబర్ బదులుగా ఈరోడ్ జిల్లా, అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్ అనే ఒక వ్యక్తి నెంబర్ ప్రొఫైల్లో ఇచ్చారు. గురునాథన్ సమత్తువ మక్కళ్‌ కట్టి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ‍యనకు ప్రతిక్షణం ఫోన్లు వస్తుండటంతో వైనా నందిని ఫేస్ బుక్‌లో తన ఫోన్ నంబర్‌ని ఇచ్చిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

నందిని ఫోన్ నెంబర్ కావాలనే ఇచ్చిందా? లేదా పొరపాటున జరిగిందా? అని విచారణలో తేలాల్సి ఉంది. కలక్క పోవత్తు యారు, కళ్యాణం ముదాల్ కాదల్ సరవనన్ మీనాక్షి, వంటి సిరియల్స్ నందిని మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories