Agent: తన స్క్రిప్ట్ లో వేలు పెట్టొద్దు అంటున్న సురేందర్ రెడ్డి

Agent: తన స్క్రిప్ట్ లో వేలు పెట్టొద్దు అంటున్న సురేందర్ రెడ్డి

Arun Chilukuri
Updated on: 25 Sept 2022 4:01 PM IST
Please Don’t Involve In The Script, Leave Me Alone Says Surender Reddy On Agent Movie
X

Agent: తన స్క్రిప్ట్ లో వేలు పెట్టొద్దు అంటున్న సురేందర్ రెడ్డి

Surender Reddy: ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేని అక్కినేని అఖిల్ కు ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని పట్టుదలగా ఉన్న అఖిల్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా బాగా రావాలి అనే ఉద్దేశంతో చిత్రం నిర్మాతలు ప్రతి సన్నివేశంలోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతూ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని ఇన్పుట్స్ ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయమని సురేందర్ రెడ్డిని ప్రెషర్ చేశారట.

అయితే ఇవన్నీ తీసుకోలేకపోయిన సురేందర్ రెడ్డి నిర్మాతలకు పొలైట్ గా నో చెప్పారట. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టి పనిచేస్తున్నానని, ఇలా ప్రతిసారి స్క్రిప్టులో వేలు పెట్టి మార్పులు చెప్పకుండా స్క్రిప్ట్ తనకి వదిలేయమని అడిగారట. రేసుగుర్రం, కిక్ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించడంతో నిర్మాతలు కూడా సురేందర్ రెడ్డి మాటకు గౌరవం ఇచ్చి స్క్రిప్ట్ బాధ్యతను పూర్తిగా సురేందర్ రెడ్డి చేతుల్లోకి పెట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story