RRR Movie Update: "ఆర్ఆర్ఆర్" నిర్మాతలకి ఊరటనిచ్చిన పెన్ స్టూడియోస్

Penn Studios Acquires the North Indian Theatrical Rights of SS Rajamouli RRR Movie | RRR Movie Update
x

"ఆర్ఆర్ఆర్" సినిమా 

Highlights

* హిందీ డబ్బింగ్, తెలుగు, తమిళ్ మరియు ఇతర భాషల డబ్బింగ్ దీంట్లోనే వస్తుంది

RRR Movie Update: జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టార్ సినిమా "ఆర్ఆర్ఆర్". 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా జులై 30 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల షూటింగ్ తో పాటే సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పటికీ విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా మిగతా దేశాల్లో కూడా సినిమా మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాతే "ఆర్ఆర్ఆర్" విడుదల కాబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మాత్రమే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.

కానీ ఇన్ని సార్లు వాయిదా పడటం వల్ల బాగా నష్టపోయేది నిర్మాతలు మాత్రమే. సినిమా బడ్జెట్ కోసం పెట్టాల్సిన వడ్డీ 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు సినిమా బడ్జెట్ కూడా 550 కోట్లకు చేరింది. దీంతో ప్రొడ్యూసర్లకు పెద్ద దెబ్బ తగిలింది అని తెలుసుకోవచ్చు. కానీ తాజా సమాచారం ప్రకారం బయర్ల నుంచి నిర్మాతలకి కొంచెం ఊరట లభించిందట. పెన్ స్టూడియోస్ వారు ఈ సినిమాకి సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుక్కున్నారు.

హిందీ డబ్బింగ్, తెలుగు, తమిళ్ మరియు ఇతర భాషల డబ్బింగ్ దీంట్లోనే వస్తుంది. అలాగే హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్, డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ రైట్స్ కూడా పెన్ వారే సొంతం చేసుకున్నారట. మరోవైపు డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ "ఆర్ఆర్ఆర్" హిందీ, కొరియన్, టర్కిష్, పోర్ట్యుగీస్ మరియు స్పానిష్ రైట్స్ ని కొనుక్కున్నారు. ఇక తెలుగు తమిళ మలయాళం మరియు కన్నడ భాషల డిజిటల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకోవడం విశేషం

Show Full Article
Print Article
Next Story
More Stories