అప్పుడు పవన్ కళ్యాణ్ కి తండ్రి ఇప్పుడు బన్నీ కి నాన్న

అప్పుడు పవన్ కళ్యాణ్ కి తండ్రి ఇప్పుడు బన్నీ కి నాన్న
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ ను అందుకున్న అల్లుఅర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే....

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ ను అందుకున్న అల్లుఅర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో 'జులాయి' మరియు 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాల తర్వాత మూడవ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలు స్టార్ హీరోయిన్ ల పేరు వినిపిస్తున్నప్పటికీ దర్శకనిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ బన్నీ కి తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బొమన్ ఇరానీ 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కళ్యాణ్ తాతగారి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత 'అజ్ఞాతవాసి' సినిమా లో పవన్ కళ్యాణ్ తండ్రిగా కనిపించారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా లో కూడా బన్నీ కి పై ఆఫీసర్ గా కనిపించిన బొమన్ ఇరానీ ఇప్పుడు అల్లు అర్జున్ కు తండ్రి గా మారనున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories