తొలి అడుగులోనే ఛాలెంజింగ్ పాత్ర ..'ఉప్పెన'పై పవర్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan kalyan Comments About Panja Vaishnav Tej Uppena Movie
x

పవన్,  వైష్ణవ్ తేజ్, 

Highlights

భావోద్వేగాలను, మన చుట్టూ ఉన్నపరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'ఉప్పెన'. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ వ్యాప్తి, థియేటర్లు మూత కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది సినిమా థియేటర్లు తిరిగి తెరచుకోవడంతో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' చిత్రం శుక్రవారం కూడా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై మెగా హీరోలు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుండటం సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తోంది. సినిమా యూనిట్ ప్రమోషన్లలో బీజీగా ఉంది.

ఇక తాజాగా ఈ సినిమాపై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.''వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా మొదటి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు.మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ 'జానీ' చిత్రంలో బాల నటుడిగా హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. 'ఉప్పెన'లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థమవుతోంది.

ఈ సినిమా మనకు పరిచయం ఉన్న జీవితాలను, అందులోని ఎమోషన్స్‌ను, మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. 'ఉప్పెన' కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా తొలి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర ..'ఉప్పెన'పై పవర్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్తాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. 'ఉప్పెన' ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని పవన్ కళ్యాణ్ అభిలాషించారు.

సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చితానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తొలి సారి దర్శకత్వం వహించించాడు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories