Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లుకు ఊహించని షాక్.. రూ.250 కోట్ల బడ్జెట్ సినిమాకు వచ్చిందిదే?

Hari Hara Veera Mallu
x

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లుకు ఊహించని షాక్.. రూ.250 కోట్ల బడ్జెట్ సినిమాకు వచ్చిందిదే?

Highlights

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమా మొత్తం కలెక్షన్లు దారుణమైన స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా, మంగళవారం నాటి వసూళ్లు చూసి నిర్మాతల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఏకంగా 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.79 కోట్లను మాత్రమే వసూలు చేసింది. గత వారంతో పోలిస్తే ఈ వారం కలెక్షన్లు మరింత దారుణంగా ఉన్నాయి.

'హరి హర వీర మల్లు' సినిమా ప్రీమియర్ షోల నుంచి 12.75 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మొదటి రోజు కలెక్షన్ రూ.34.75 కోట్లగా నమోదైంది. ఈ రెండు కలిపితే మొత్తం 47.50 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే, ఆ తర్వాత ఐదు రోజుల్లో సినిమా వసూలు చేసింది కేవలం 32 కోట్ల రూపాయలు మాత్రమే. శనివారం, ఆదివారం సినిమాకు కాస్త మంచి కలెక్షన్లు వచ్చినా, ఈ వారం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది.

సోమవారం (జులై 28) ఈ సినిమా కేవలం 2.1 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మంగళవారం (జులై 29) రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఈ రెండు రోజుల్లో కలిపి మొత్తం 3.85 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ 'హరి హర వీర మల్లు' కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ శుక్రవారం నాటికి సినిమా షోల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనా. దీంతో, సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ల కలను చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అంత యాక్టీవ్ గా లేరు. ఇప్పుడు ఇలాంటి పరాజయం ఎదురైతే, ఆయన నటనకు మరింత దూరమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories