పవన్ కల్యాణ్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు క్లైమాక్స్ యాక్షన్! జులై 24న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ

పవన్ కల్యాణ్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు క్లైమాక్స్ యాక్షన్! జులై 24న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ
x

Pawan Kalyan’s Direction: Hari Hara Veera Mallu Climax Action Set for Grand July 24 Release

Highlights

Pawan Kalyan’s Direction: Hari Hara Veera Mallu Climax Action Set for Grand July 24 Release

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా జులై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ చిత్రంపై అంచనాలు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. 2023లో వచ్చిన 'బ్రో' తర్వాత పవన్ కల్యాణ్ నుండి వస్తున్న పూర్తి స్థాయి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు, ఈ మూవీలోని క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌కు పవన్ స్వయంగా డైరెక్షన్ వహించడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

పవన్ కల్యాణ్ డైరెక్షన్‌లో యాక్షన్ హైలైట్:

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్ – “రియల్ లైఫ్‌లో రౌడీలు ఎదుర్కొన్నా, రీల్ లైఫ్‌లో యాక్షన్ చేయడానికి కష్టపడ్డా. అందుకే నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ ప్రాక్టీస్ చేసి, క్లైమాక్స్ యాక్షన్ సీన్‌ను నేను డైరెక్ట్ చేశాను” అని వెల్లడించారు.

క్రిష్ చెప్పిన కథతో సినిమాకు ఆకర్షణ:

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చెప్పిన కథ పవన్‌కి బాగా నచ్చిందట. కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎలా లండన్ మ్యూజియంకు చేరిందన్న నేపథ్యంలో ఈ కథ తయారైంది. "ఈ కథ వినగానే నాకు నచ్చింది. నేను నా ఎనర్జీ మొత్తం సినిమాకు పెట్టాను. ఇది కలెక్ట్ చేసే కలెక్షన్ల కంటే, మీకు నచ్చితే చాలు" అంటూ పవన్ భావోద్వేగంగా మాట్లాడారు.

పవర్‌ఫుల్ మెసేజ్‌తో కల్పిత పాత్ర:

పవన్ మాట్లాడుతూ – "మన దేశం ఎప్పుడూ ఎవరిపై దాడి చేయలేదు. కానీ మనపై మాత్రం అనేకమంది దాడి చేశారు. చత్రపతి శివాజీ వంటి వారు ధైర్యంగా పోరాడారు. అలాంటి ధర్మ పోరాటం చేసే కల్పిత పాత్రే హరిహర వీరమల్లు. ఇది ప్రజల మనసులను తాకే కథ" అని వివరించారు.

మూవీ వివరాలు (Cast & Crew):

  1. హీరో: పవన్ కల్యాణ్
  2. హీరోయిన్: నిధి అగర్వాల్
  3. దర్శకులు: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
  4. నిర్మాత: ఏఎం రత్నం
  5. బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్
  6. రిలీజ్ తేదీ: జూలై 24, 2025
  7. జానర్: పీరియాడికల్ యాక్షన్ డ్రామా
  8. భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం (పాన్ ఇండియా విడుదల)
Show Full Article
Print Article
Next Story
More Stories